సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పల్లెదావాఖానలో ఎదుట ఆందోళన
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్నిరెడ్డిగూడెం గ్రామంలోని పల్లె దావాఖానలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని కేటాయించాలని సీపీఎం పార్టీ శుక్రవారం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించింది. అర కొర సిబ్బందితో రోగులకు సేవలు అందుతున్న ఆసుపత్రిలో ఫుల్ టైమ్ వైద్య సిబ్బందిని త్వరగా నియమించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.