రేపు ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
BDK: టేకులపల్లి మండలంలో రేపు ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ సభ్యులు ఇవాళ ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలుపును ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. పార్టీ శ్రేణులు ఈ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.