పాకాల హైవేపై ప్రమాదం

పాకాల హైవేపై ప్రమాదం

TPT: పాకాల మండలం కోనప్పరెడ్డిపల్లె వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నరేష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలసి కారులో తిరుపతి నుంచి చిత్తూరుకు బయల్దేరారు. మధ్యలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి పాకాల పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.