పుట్టపర్తిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

పుట్టపర్తిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సత్యసాయి :పుట్టపర్తి వాసవి నివాస్‌లో 36 మంది లబ్ధిదారులకు రూ.58.10 లక్షల విలువైన CMRF చెక్కులను MLA పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న పేదలకు CM చంద్రబాబు నాయుడు పెద్దకొడుకుగా అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.3.60 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు.