నెలకు 6 వేలు.. దరఖాస్తు చేసుకోండి!

TG: ధూపదీప నైవేద్య పథకానికి రాష్ట్ర దేవాదాయశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన దేవాలయాలకు నెలకు రూ.4 వేలు, అర్చకుడికి గౌరవ భృతి కింద నెలకు రూ.6 వేలను ఈ పథకం కింద చెల్లించనుంది. ఈ పథకం కోసం దరఖాస్తులను పూర్తి చేసి మే 24వ తేదీలోపు ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని స్పష్టం చేసింది.