వాటి కదలికలను గమనించండి: DY. CM పవన్

AP: ప్రజలను రక్షించే క్రమంలో ఏనుగు దాడి చేయడంతో గాయపడిన FSO సుకుమార్, ఏనుగుల ట్రాకర్ హరిబాబుకు మెరుగైన చికిత్స అందించాలని DY. CM పవన్ కళ్యాణ్ అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కదలికలను కొన్ని రోజులపాటు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే కుంకీ ఏనుగులతో గస్తీ నిర్వహించాలని చెప్పారు.