నియామక పత్రం అందుకున్న డీసీసీ అధ్యక్షురాలు
JN: డీసీసీ అధ్యక్షురాలిగా ధన్వంతి లకావత్ ఇటీవల నియామకమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆమె నియామక పత్రం అందుకున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా ఆమె గాంధీభవన్‌లో నియామకపత్రం తీసుకున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.