భానుడి భగభగ.. చలివేంద్రాలెక్కడ?

భానుడి భగభగ.. చలివేంద్రాలెక్కడ?

MDK: రామాయంపేట మండలంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా గతంలో ప్రధాన కూడళ్లు, బస్టాండు ప్రాంతాల్లో అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కడా చలివేంద్రాలు ప్రారంభించకపోవడంతో బాటసారులు, ప్రయాణికులు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.