ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు ప్రకటించడం జరిగిందని చెప్పారు. తిరిగి ఈ నెల 6 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని మార్కెట్ శాఖ అధికారులు పేర్కొన్నారు.