కందూరులో 17 పొట్టేళ్లు మృతి

CTR: కుక్కల దాడిలో పొట్టేళ్లు మృతిచెందిన ఘటన సోమల మండలం కందూరు పాలెంవీధిలో చోటుచేసుకుంది. చిన్నబ్బ పొట్టేలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. నిన్న రాత్రి 2గంటల ప్రాంతంలో కుక్కలు దాడి చేయడంతో 17 పొట్టేళ్లు మరణించాయి. ఇటీవల గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని.. లేగదూడలపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయని పలువురు వాపోతున్నారు.