'టీడీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు'

నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని సోమవారం ఖండించారు. దాడి స్పష్టంగా కనిపించినప్పటికీ టీడీపీ నేతలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు కేసు పెట్టారని కానీ వీడియోలో కనిపించినవారిపై కేసులు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.