UPDATE: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
NRML: కడెం మండలం కల్లెడ అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జాఫర్ నగర్కు చెందిన శరీఫోద్దీన్ (50) అక్కడికక్కడే మృతి చెందారు. కడెం నుంచి మంచిర్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వారి కుటుంబ సభ్యులైన బిల్లాలోద్దీన్ (32), నేహాశరీన్ (26), హైరాహోనిన్ (9) తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే లక్షెటిపేట్ ఆసుపత్రికి తరలించారు.