అరకు ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే రేగం

ASR: అరకు ఏరియా ఆసుపత్రిని మంగళవారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సందర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముందుగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అవసరమైన మందులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.