ఉపాధ్యాయుల సమస్యల పై మౌనం సరికాదు

SKLM: ఉపాధ్యాయుల సమస్యలపై కూటమి ప్రభుత్వం మౌనం సరికాదు STU జిల్లా అధ్యక్షులు ఎస్.వి రమణమూర్తి అన్నారు. గురువారం ఆమదాలవలస ఎంఈవో కార్యాలయంలో ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు ఏర్పడిన ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్య పట్ల కూడా నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.