రహదారి ఆక్రమణలపై మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు

రహదారి ఆక్రమణలపై మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు

NTR: విజయవాడ పరిధిలోని జోజి నగర్‌లో రహదారి ఆక్రమణ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి లోకేశ్‌కు తాజాగా ఫిర్యాదు అందింది. ఈ మేరకు టీడీపీ SC సెల్ నాయకులు అనిల్, దుర్గారావులు మంత్రి లోకేశ్ నిర్వహించే ప్రజాదర్బారులో ఫిర్యాదు అందజేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.