VIDEO: శ్రీపాద శ్రీ వల్లభునికి అక్షయ తృతీయ చందనోత్సవం
KKD: పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానంలో సోమవారం అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. EO ఆర్. సౌజన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి చందనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక హోమాలు జరిపించారు. సాయంత్రం పల్లకి సేవ జరగనుంది.