మృతుడు కేసనపల్లికి చెందిన దుర్గా ప్రసాద్

కోనసీమ: మలికిపురం మండలం శంకరగుప్తం డ్రైన్‌లో లభ్యమైన మృతదేహం కేసనపల్లికి చెందిన కడలి దుర్గాప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. మలికిపురం ఎస్సై సురేశ్ తెలిపిన వివరాలు ప్రకారం.. అతను హోం గార్డుగా పనిచేస్తున్నాడని, అనారోగ్యంతో కొన్ని రోజులు సెలవు పెట్టాడని తెలిపారు. ప్రమాదవశాత్తు డ్రైన్‌లో పడి మృతి చెందాడన్నారు. వీఆర్వో పిర్యాదుతో కేసు నమోదు చేసామని తెలిపారు.