మాజీ ప్రధానికి ఘన నివాళి

MNCL: మంచిర్యాలలోని బీజేపీ కార్యాలయంలో శనివారం మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వాజపేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ మాట్లాడుతూ.. వాజ్‌పేయి జీవిత చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డారని తెలిపారు.