VIDEO: నిర్మానుష్యంగా ఖమ్మం కొత్త బస్టాండ్
KMM: ఆర్టీసీ సమ్మె సెగతో ఖమ్మం న్యూ బస్టాండ్ బుధవారం నిర్మానుష్యంగా మారింది. జేఏసీ పిలుపుతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే బస్టాండ్‌కు వచ్చిన జనం బస్సులు లేక దిక్కుతోచని స్థితిలో కనిపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.