ఉల్లాస్ పథకం కింద వాలాంటి టీచర్లకు శిక్షణ

KNR: చొప్పదండి మండలం రేవెల్లిలో ఉల్లాస్ పథకం కింద మంగళవారం వాలంటీర్ టీచర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముల్కల కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరక్షరాస్యులందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. 2027 నాటికి ఐదు కోట్ల మందిని అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.