VIDEO: నౌకాదళ శిక్షణకు దిక్సూచి INS Tir
VSP: భారత నౌకాదళ శిక్షణకు వెన్నెముకగా నిలిచిన ఐఎన్ఎస్ తీర్ తన 40 ఏళ్ల గంభీర ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. Indian Navyలో ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్లో సీనియర్ నౌకగా ఉన్న ఈ శిక్షణ నౌక, తరతరాల నౌకాదళ అధికారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది. సముద్ర నైపుణ్యం, సహనశక్తితో నౌకాదళ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచింది.