VIDEO: పాకలోనే విద్యాబోధన
ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని దూరపొలం గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. గ్రామంలో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ శాశ్వత భవనం లేక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాకలోనే తరగతులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.