ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు
PPM: పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యార్థుల్లో ఆనందం, ఉత్సాహం వెల్లివిరిసింది. చివరి రోజు పరీక్షను పూర్తి చేసిన అనంతరం విద్యార్థులు సంతోషంగా కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. కొందరు స్నేహితులతో, మరికొందరు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. పరీక్షల ఒత్తిడి ముగియడంతో ఉపశమనం వ్యక్తం చేసిన విద్యార్థులు, ఇప్పుడు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.