బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA
BHPL: రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కీ.శే. మద్ది సదయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.