అదుపుతప్పి డివైడర్‌ను ఢీ.. వ్యక్తి మృతి
WGL: ఖిల్లా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు ఎదుట జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతూ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న లారీ క్రింద పడ్డాడు. దీంతో లారీ అతనిపై నుంచి వెళ్లింది. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు వ్యక్తి మృతి చెందినట్టు నిర్ధారించారు.