చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుంటూరు పోలీసులు పార్కింగ్ చేసిన కార్‌లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేశారు. నిందితుడిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టి ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా గిరిజవోలుకి చెందిన జంగం బాజీ అనే వ్యక్తిగా గుర్తించారు. నిందితుడి నుంచి రూ. 6 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, రూ. 2 లక్షల నగదు, 11 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.