VIDEO: వైద్యుల ఆధ్వర్యంలో ఏడ్స్‌పై అవగాహన ర్యాలీ
WGL: రాయపర్తి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ఏడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సురేష్ మాట్లాడుతూ.. ప్రజల్లో HIV - AIDS సంక్రమణ, నివారణ, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, సమాజంలో అపోహలు తొలగించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.