VIDEO: గోమాత రక్షణే భూమాతకు రక్ష: మురంశెట్టి రాములు
SDPT: గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్లేనని మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు, యాదగిరి స్వామీజీ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన గోమాత నామకరణ మహోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారని, ఆవును రక్షిస్తేనే భూమాత సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.