ట్యూషన్‌లో చదవడం లేదని.. విద్యార్థికి గరిటతో వాతలు
HYD: బంజారాహిల్స్ పరిధిలో ఉన్న ఓ ట్యూషన్ కేంద్రంలో సరిగా చదవడం లేదన్న కారణంతో ఒకటో తరగతి చదువుతున్నటువంటి తేజ నందన్(6) అను విద్యార్థిపై ట్యూషన్ టీచర్ మానస గరిటతో తొడలు, వీపు, చేతులు, బుగ్గలు వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో ఏడుస్తూ ఇంటికెళ్లిన బాలుడు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.