'వృత్తి నైపుణ్యాలు అవసరమే'
ASR: విద్యార్ధులు చదువుతో పాటూ వృత్తి నైపుణ్యాలను అవసరమని రవ్వలగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం టీ నాగేశ్వరరావు మంగళవారం అన్నారు. ఆటోమోటివ్ వృత్తి విద్య ఇంటర్న్‌షిప్ పూర్తిచేసుకున్న విద్యార్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు ప్రభుత్వం అందించిన సర్టిఫికెట్స్, టీ షర్ట్, టూల్ కిట్స్‌ను అందించారు.