'లోకేష్ సీఎం అవుతారు'
ప్రకాశం: ఒంగోలులో మెప్మా ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 'ఎగ్ మార్ట్స్' పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో లోకేష్ సీఎం అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి సమస్యపై లోకేష్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం మెప్మా ద్వారా పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు.