VIDEO: రేషన్ షాపుల్లో అక్రమాలు.. డీలర్లపై 6ఏ కేసులు

VIDEO: రేషన్ షాపుల్లో అక్రమాలు.. డీలర్లపై 6ఏ కేసులు

WGL: వరంగల్‌ నగరంలో రేషన్ షాపుల తనిఖీల్లో బియ్యం నిల్వల్లో తేడాలు బయటపడటంతో పలువురు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో విజిలెన్స్ బృందం శనివారం నిర్వహించిన తనిఖీల్లో ఎల్బీనగర్, ఖిలా వరంగల్, కాశీబుగ్గ ప్రాంతాల్లో నిల్వల లోపాలు గుర్తించారు. సంబంధిత డీలర్లపై కేసులు నమోదు చేసి నివేదికను అదనపు కలెక్టర్‌కు పంపించారు.