VIDEO: కోదాడ రోడ్లపై పశువుల సంచారం

VIDEO: కోదాడ రోడ్లపై పశువుల సంచారం

SRPT: కోదాడ ప్రధాన రహదారులపై పశువుల సంచారం పెరగడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇటీవల హుజూర్‌నగర్ రోడ్డులో పశువులు అడ్డురావడంతో బైక్ డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మున్సిపల్ యంత్రాంగం వెంటనే స్పందించి, యజమానులను హెచ్చరించి, రోడ్లపై తిరుగుతున్న పశువులను తొలగించి, వాహనదారుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.