'రోడ్డు ప్రమాదాల నివారణకు మంచి రోడ్లు కూడా ఉండాలి'
NGKL: రోడ్డు ప్రమాదాల నివారణకు మంచి రోడ్లు కూడా ఉండాలని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు మనుషులు వాహనాలు రోడ్లు కారణమవుతున్నాయన్నారు. 15 సంవత్సరాలు పైబడిన వాహనాలను ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించకూడదన్నారు.