ఆర్పీ ఉద్యోగి రాజీనామా..

NZB: లోక్ సభ ఎన్నికల దృష్ట్యా విధులు నిర్వహించిన ఓ మహిళ ఆర్పీ ఉద్యోగితో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన దురుసు వ్యాఖ్యలకు సదరు మహిళ మున్సిపల్ కమిషనర్ కు ఇచ్చిన రాజీనామా లేఖ దుమారం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల్లో బూతు నెంబర్ 54లో విధులు నిర్వహించిన దొండి గంగామణిని గెట్ అవుట్ అని బెదిరిస్తూ బయటకు పంపారని లేఖలో పేర్కొన్నారు.