రేపు మూడో దశ పంచాయతీ ఎన్నికలు
TG: రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు 3,752 పంచాయతీలు, 28,406 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. మూడో దశలో 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాల వల్ల 11 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.