అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
MHBD: ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులమంటూ బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు. పెద్దవంగరకు వెళ్తున్న ఆనంద్ అనే వ్యక్తిని అడ్డగించి జాటోత్ ఉపేందర్ రూ. లక్ష ఇస్తే గాని వదలమని బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.