శాశ్వత రాజధానిపై వాడవాడలా సంబరాలు
VSP: భారత పార్లమెంట్ అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఆమోదిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల నిరీక్షణకు తెరపడటంతో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కలెక్టరేట్‌ను లైట్లతో అలంకరించారు.