ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. మరో ఐదుగురు మృతి
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన మొత్తం 286 డ్రోన్‌లలో తాము 260 డ్రోన్లను గాలిలోనే నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. నికోపోల్ నగరంలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మరణించారు. 14 ఏళ్ల బాలికతో సహా మొత్తం 19 మంది గాయపడగా.. సుమీ నగరంలో ఇంకో 11 మందికి గాయాలయ్యాయి.