నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం అందించిన కేంద్రమంత్రి

W.G: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు పార్లమెంట్ కార్యాలయంలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, సీ ఫుడ్స్ ఎక్స్ పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందించారు. భారత సముద్ర ఆహార ఎగుమతి పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు కోరారు. ఈ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వివరించారు.