'వీఆర్ఏలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి'
ASR: వీఆర్ఏలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు కోరారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు శుక్రవారం పలువురు వీఆర్ఏలు అరకు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన నేతలు వీఆర్ఏలకు మద్ధతు తెలిపారు. వీఆర్ఏలకు అటెండర్లు, వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలన్నారు.