‘పార్టీ మారొద్దని జీవన్ రెడ్డికి చెప్పాం’
TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ భేటీ అయ్యారు. పార్టీ మారవద్దని ఆయనను కోరారు. జీవన్ రెడ్డి బాధపడితే తాము బాధపడ్డట్టేనని, ఈ ప్రాంతానికి ఆయనే పెద్ద దిక్కని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే 10 మంది MLAలను చేర్చుకున్నామని వివరించారు. భేటీలోని అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.