రేషన్ బ్యాగుల కోసం తప్పని తిప్పలు.!
KMR: మద్నూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యంతో పాటు పర్యావరణ హితమైన బ్యాగులను అందజేస్తోంది. ఈ బ్యాగులను ఏ రేషన్ దుకాణాల్లో పేరుందో అక్కడే తీసుకోవాలనే నిబంధనతో దూర ప్రాంతంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారులు కేవలం బ్యాగుల కోసం సొంత గ్రామాలకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతర ప్రాంతంలో ఉన్న వారు రాకపోవడంతో రేషన్ దుకాణాల్లో బ్యాగులు అలాగే ఉంటున్నాయి.