పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు:ఎస్ఐ
SDPT: మహిళలు పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు మహిళలు ఆర్మీ , పోలీస్ వంటి అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారన్నారు. మహిళలు ధైర్యం,పట్టుదలతో ముందడుగు వేస్తే అన్ని సాధించవచ్చన్నారు. మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.