అగ్ని ప్రమాదం.. రూ.4లక్షలు ఆస్తి నష్టం

అగ్ని ప్రమాదం.. రూ.4లక్షలు ఆస్తి నష్టం

ELR: కామవరపుకోట మండలం రామన్నపాలెంలో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో గడ్డం వసంతరావుకు చెందిన షెడ్డు, 400 గడ్డికట్టలు, డ్రిప్ పైపులు కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. స్థానికులు జంగారెడ్డిగూడెం అగ్నిమాపక యంత్రానికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.4లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగింది.