చమురు కొరత.. అంత్యక్రియలు నిలిపివేత
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా థాయ్‌లాండ్‌లోని ప్రముఖ బౌద్ధ దేవాలయం వాట్ మహాథాట్‌లో అంత్యక్రియలు నిలిచిపోయాయి. భారీగా ఇంధనాన్ని అమ్మేందుకు పెట్రోల్ బంకులు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి దహన సంస్కారానికి 90 లీటర్ల ఇంధనం అవసరమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇక్కడ కట్టెలకు బదులు డీజిల్‌ను వాడతారు.