గ్యాస్ ధరలు తగ్గించాలని తిరువూరులో సీపీఐ ధర్నా
NTR: తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ ఔట్ గేటు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ధర్నా నిర్వహించారు. పెరిగిన వంట గ్యాస్ ధరలతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.