కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా అయూబ్ బాషా

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా అయూబ్ బాషా

CTR: పుంగనూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా యస్. అయూబ్ బాషా ఎన్నికయ్యారు. ఆదివారం రాయచోటిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మురళి మోహన్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. తమపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అయూబ్ తెలిపారు.