సుజాతనగర్ పీహెచ్‌పీని తనిఖీ చేసిన ఇంఛార్జి డీఎంహెచ్ఓ

BDK: సుజాతనగర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఇంఛార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు, 0-2 సం. వయసు ఉన్న పిల్లలకు అందిస్తున్న వ్యాధి నిరోధక టీకాల గురించి అడిగి తెలుసుకున్నారు. టీకాల నిర్వహణ, లభ్యత, నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.