'ఆసుపత్రికి తరలించే వారికి రూ. 25 వేల ప్రోత్సాహకం'

'ఆసుపత్రికి తరలించే వారికి రూ. 25 వేల ప్రోత్సాహకం'

PDPL: రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించే వారికి ప్రభుత్వం రూ. 25,000 ప్రోత్సాహకం అందిస్తుందని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో ఇవాళ నిర్వహించిన రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలు పాటించాలని తెలిపారు. గోల్డెన్ అవర్ సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలు రక్షించవచ్చని సూచించారు.